16, సెప్టెంబర్ 2010, గురువారం

ఎవరికివారే

సవ్యసాచి పుట్టిన దేశంలో 
ప్రతి ఒక్కడూ ఒంటి చేతి వీరుడే 
ధర్మజుడు జన్మించిన కర్మభూమిలో
అన్నీ కుంటి కాలి నడతలే
బుద్ధుడు ప్రభవించిన పుణ్య భూమి లో 
అందరూ పక్షవాతపు ఆలోచనల మేధావులే 
దార్శనికులు ఉద్భవించిన దివ్యభూమిలో 
అందరివీ ఒంటికంటి చూపులే
తల వెంట్రుకలంత మంది మహానాయకులు 
సామ్యవాదపు పళ్ళ దువ్వెనకు ఎదురు తిరుగుతారు 
కాలికో మతం వేలికో కులం 
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి 
కనాదుడుదయించిన వేదభూమిలో
ప్రతీ కణం మరో కణాన్ని ద్వేషిస్తుంది 
ప్రతీ అణువూ మరో అణువుతో కలహిస్తుంది 
అశోకుడేలిన అఖండ భారతం 
విభేదాల అఖాతంలో పడి 
వేర్పాటు గండశిలలకు విడి 
ఖండ ఖండాలుగా ఛిద్రం అవుతుంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి


Blog designed by Gopi varaprasad Rao,Cell:9247171248