20, సెప్టెంబర్ 2010, సోమవారం

  మధ్యతరగతి మానవుడు
     
సమస్యల ముళ్ళ కిరీటం ధరించిన ఏసు క్రీస్తును నేను 
మధ్య తరగతి మనస్తత్వాన్ని మేకులుగా మార్చి 
నా అణువణువునా నేనే దిగ్గొట్టుకున్నాను
ఆలోచనల వట  వృక్షం క్రింద తపస్సు చేస్తున్న బోధి సత్వుణ్ణి నేను 
నెరవేరని కోరికలన్నీ నా కేశాల్లో చిక్కు పడి ఉన్నాయి 
చీమకు కూడా హాని చేయని మహావీరుణ్ణి నేను 
పరిస్థితులకు భయపడి నన్ను నేనే నరుక్కుంటాను 
నాకు హాని చేసిన ప్రతీ ఒక్కణ్ణి 
నా అసమర్ధతతో క్షమించేస్తాను 
అందుకే నేను అజాత శత్రువును 
బొటనవేలు తెగిన ఏక లవ్యుడిని నేను 
సంపాదించిన జ్ఞానం నా జీవితానికి పనికిరాదు 
రూపాయలతో మనిషిని కొలిచే లోకంలో 
రోజు రోజుకూ మరుగుజ్జవుతున్న విక్రముడిని 
అష్ట కష్టాల అష్టావక్రుడినీ నేనే 
          కానీ ........
ఈ విరూపికి స్వరూపాన్నిచ్చే  సుసైన్యపు శిశువుకు 
నోటితో ప్రాణం పోసి మెదడుతో సాకుతాను 
నవప్రభాతాన్ని సృష్టించి బ్రహ్మనే అవుతాను .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి


Blog designed by Gopi varaprasad Rao,Cell:9247171248