Pages

11, సెప్టెంబర్ 2010, శనివారం








గురుహృదయం
మా తోటన వసియించును
వసివాడని గులాబీలు
గులాబీలు వెదజల్లును 
విజ్ఞానపు సౌరభాలు
సౌరభాల తరంగినులు 
ప్రవహించును భవితలోకి
భవిత కూడ తన్మయమై 
పయనించును ప్రగతిలోకి
ప్రభవించిన ప్రగతి జూచి
ప్రమోదమ్ము హృది నిండగ
స్పందించిన నయనమ్ముల
భాష్పబిందువులు పండగ
గర్వింతును నన్ను జూచి 
జయించితిని జగతిననుచు.

      ఈ కవిత ప్రతి బడి గోడ మీదా ఉంటే బాగుండుననే ఒక పెద్ద కోరిక నాకు ఉన్నది .కవిత కూడా అర్హత కలదిగానే అనిపిస్తుంది .కానీ అంత అదృష్టం ఈ కవితకు ఉందో లేదో నాకు తెలియదు.
________________________________

1 కామెంట్‌: