26, సెప్టెంబర్ 2010, ఆదివారం

                    ఆవాహన
పసి మెదడుకు స్టార్ కనెక్షన్ ఇచ్చి 
చెవుల్లో కసి సంగీతం పోసి 
కళ్ళలో చలన చిత్ర కాల కూటం నింపి, 
హృదయంలో హింసను కూరి, 
చేతుల్లో స్వార్థపు తాయిలం పెట్టి, 
భవితలోకి నడవమంటే, 
సంక్షేమ గృహాలు సాని కొంపలు కావా ?
వావి వరుసలు వల్లకాడయిపోవా?
ఆ భావి పౌరుడినీ ,
భవిష్యత్ సంస్కృతీ చిత్రాన్నీ ,
తలుచుకుంటేనే భయంగా ఉంది 
కలకత్తా కాళిక నాలుకలూ 
రుద్రాళిక నయనజ్వాలికలూ 
విద్వంసక పిశాచ నృత్యాలూ 
దాపునే ఉన్నట్లుంది 
హాలాహలాన్ని సెన్సార్ చేసిన 
                             హరహరా నీవెక్కడ 
ఈ అణు యుగపు రేడియేషన్ ను 
                             సెన్సార్ చేసే మేధావి గా రావా 
లేకుంటే ...........
ఈ మానవ బాంబులు వ్రేల్చిన బూడిదే 
                              నీకు విభూది అవుతుంది 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి


Blog designed by Gopi varaprasad Rao,Cell:9247171248